భార్య వివాహేతర సంబంధం కారణంగా హుస్సేన్ సాగర్‌లో దూకి టెక్కీ ఆత్మహత్య

  • ఫిబ్రవరి మొదటి వారంలో ఆత్మహత్య చేసుకున్న సీతారామ్ రెడ్డి
  • కోడలి వివాహేతర సంబంధమే కారణమని సీతారామ్ రెడ్డి తండ్రి ఆరోపణ
  • భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో సీతారామ్ రెడ్డి ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు భార్య కారణమని ఆయన అందులో ఆరోపించారు. ఆయన ఫిబ్రవరి మొదటి వారంలో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా, 19 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. తన కుమారుడి మృతికి కోడలి వివాహేతర సంబంధమే కారణమని సీతారామ్ రెడ్డి తండ్రి ఆరోపించారు.

ఏం జరిగింది?

సీతారామ్ రెడ్డి భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె దారుణాలు చూడలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. సీతారామ్ రెడ్డిది ఏపీలోని మార్కాపురం కాగా, భార్యది నంద్యాల. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సీతారామ్ రెడ్డి టెక్కీగా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం బాచుపల్లిలో నివసిస్తోంది. భార్య గురించి తెలియడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన సీతారామ్ రెడ్డి ఫిబ్రవరిలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

Hyderabad techie dies by suicide
Techie Suicide

More Telugu News